Te:NeMo-MozillaLanguage

From MozillaWiki
Revision as of 18:08, 22 February 2013 by Meraj Imran (talk | contribs)
Jump to navigation Jump to search


మొజిల్లా మీ భాష లో

సాంకేతిక పరిజ్ఞానం(టెక్నాలజీ) అనేది ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది. టెక్నాలజీ ప్రజలకు సులభంగా లబిస్తుంది. టెక్నాలజీ ప్రజలను ప్రభావితం చేస్తుంది. టెక్నాలజీ మనుషుల మద్య దూరాలను తగ్గించవచ్చు లేదా తగ్గించాకపోవొచ్చు? ఈ రోజులలో ఆంగ్ల భాష తెలిసిన వాళ్ళు మాత్రమే టెక్నాలజీని గురించి తెలుసుకోగలుగుతున్నారు.టెక్నాలజీ గురించి తెలుసుకోవటానికి భాష అనేది అడ్డుగోడగా వుంటుందా? ఈ రోజుల్లో టెక్నాలజీ వ్యాప్తి చెందుతూ మానవ జీవితాన్ని సులభంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఒక రోగనివారిణిగా పనిచేస్తుంది. టెక్నాలజీ ఎవరికీ తెలిసిన భాషలో వాళ్ళకు సులభంగా తెలిస్తే సులభంగా అర్ధం చేసుకోగలుగుతారు

కంప్యూటర్ నేర్చుకోవటానికి ఇష్టపడేవారు ఆంగ్లము నేర్చుకోవటం అవసరమా? ఒక వ్యక్తి సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవటానికి ఇంగ్లీష్ ఎ అవసరమా ? ఈ సమస్య అనేది ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న దేశాలలో ఎక్కడయితే ప్రజలు మాతృభాషలో విద్యను అభ్యసిస్తున్నారో అక్కడ తలెత్తుతుంది. దీనికి తోడుగా తక్కువ అక్షరాస్యత శాతం ఉన్న దేశాలలో ఒక విషయాన్నీ గ్రహించడం, దానిని ఇతరులతో పంచుకోవటం, అనేది ఎక్కువగా గ్రామీన ప్రాంతాలలోని చదువులో సమాన హక్కులు లేని పేద మహిళలలో వస్తుంది. ఇలాంటి ప్రశ్నలకి ఒక సమాధానం కావాలి.వీటికి సమాదానం లోకలైజేషన్ మరియు ఇంటర్నేష్నలైజేషన్ వీటిలో లభిస్తుంది.వీటిని l10n మరియు i18n అని కూడా అంటారు.

ముందుగా లోకలైజేషన్ గురించి తెలుసుకుందాం. లోకలైజేషన్ అనగా ఒక వస్తువును తీసుకుని దానిని ఏ ప్రాంతంలో ఉపయోగిస్తారో ఆ ప్రాంతానికి తగ్గట్టు సంప్రదాయబద్ధంగా తయారు చేసి ఇవ్వడం. అదేవిధంగా ఇంటర్నేష్నలైజేషన్ అనగా వస్తువులను విడుదల చేసి వేరు వేరు ప్రాంతాలకు తగ్గట్టుగా అందించడం, దీనికన్నా లోకలైజేషన్ అనేది సులభం.. ప్రపంచం లో లోకలైజేషన్ కి ఒక కోడ్ ఉంది... ఈ రోజుల్లో ఇంటి గడప దాటని వాళ్ళకి ఈ సంకేతిక పరిజ్ఞానం అనేది ఇంటర్నెట్ ద్వారా ఒక మంచి అవకాశం.. ఇంటర్నెట్ ని లోకలైజేషన్ చేయటం ద్వారా చాలా మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు.

కాని మొజిల్లా అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది? మొజిల్లా ప్రజల నుంచి ఏమి ఆశించదు,ఇది వెబ్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తు ప్రజలకు అనుగుణంగా తయారు చేస్తుంది. నేడు మొజిల్లా ప్రాజెక్ట్ గొప్ప సాఫ్ట్వేర్ గా ఎదిగి ప్రపంచం లో నే పేరు పొందిన (browser) బ్రౌసర్ గా మొజిల్లా ఫైరుఫాక్సు (mozilla firefox) చేరుకుంది. ఇదే కాకుండా మొజిల్లా ప్రాజెక్ట్ FOSS (Free and Open Source Software)ప్రపంచంలో లోకలైజేషన్ మరియు ఇంటర్నేష్నలైజేషన్ కు ఒక గొప్ప ఉదాహరణ.. ఈ రోజు మొజిల్లా ప్రాజెక్ట్ 70 భాషలలో వివిధ ప్రాంతాలకు తగట్టుగా రూపొందించిన community developers కి మనము కృతజ్ఞత చెప్పుకోవాలి..మొజిల్లా ప్రాజెక్ట్ లోని అంశాల్లో ఒక ముఖ్య లక్ష్యం mozilla.org లోని ప్రొడక్ట్స్ మరియు ప్రాజెక్ట్స్ ను అనువదించటం అదేనండీ.. లోకలైజేషన్. ప్రపంచం లోని ఏ భాషలోకయినా మార్చడం..

దాదాపుగా 450 మిలియన్ ప్రజలలో ఎంతమంది ఎంతమందిని చైతన్యవంతులని చేయగలుగుతున్నారు?దానికి చాల మార్గాలు ఉన్నాయి, మీరు మొజిల్లా సాఫ్ట్వేర్ ని ప్రజలకు అర్ధమయ్యే భాషలో తెలియచేసి వారిని చైతన్య వంతులను చేయచ్చు .. లేదా మీరు మొజిల్లా కమ్యూనిటీ లో ఒక సభ్యునిగా చేరి లోకలైజేషన్ తెలియచేయచ్చు.మొజిల్లా కి మీ యొక్క సేవలందించి తగిన గుర్తింపును పొందండి .